![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -104 లో.. అభి ఫ్రెండ్ ని శ్రీలత కలిసి అభి గురించి అడుగుతుంది. నాకేం తెలియదని అతను చెప్తాడు. అభిని ఏదో చేసి ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకునేంత తెలివి తక్కువవాడైతే సీతాకాంత్ కాదని శ్రీలత అంటుంది.. కానీ అభి కనబడకుండా మాయం అవ్వడానికి మాత్రం సీతాకాంత్ కారణం ఇందులో డౌట్ లేదు. అభి ఫ్రెండ్ కి శ్రీలత కొంత డబ్బులిచ్చి అభి గురించి తెలుసుకోమని చెప్తుంది.
మరొకవైపు అభి మాట్లాడిన దాని గురించి తల్చుకొని రామలక్ష్మి బాధపడుతుంది. నువ్వు ఇలా ఏడుస్తుంటే.. మీ వాళ్ళకి డౌట్ వస్తుంది. ఇప్పటికే వాళ్ళకి డౌట్ ఉంది. ఆ అభి ఎలాంటి వాడు అనేది ముందే తెలిసినందుకు సంతోషపడు అని రామలక్ష్మికి సీతాకాంత్ చెప్తాడు. సీతాకాంత్ వెళ్ళబోతుంటే రామలక్ష్మి తన చెయ్యి పట్టుకొని.. మీ వల్లే నేను ఇక్కడున్నా అని సీతాకాంత్ గురించి గొప్పగా మాట్లాడుతుంది. మీరు ఈ రోజు నుండి నాకు ఒక మంచి స్నేహితుడని రామలక్ష్మి అంటుంది. ఇక నుండి ఏ కష్టం రాకుండా నిన్ను చూసుకుంటానని మాటిస్తున్ననని రామలక్ష్మికి సీతాకాంత్ మాటిస్తాడు. మరొకవైపు శ్రీవల్లి సీరియల్ చూస్తూ ఎక్సయిట్ మెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదని ఫోన్ చేస్తుంది. నేను మా ఇంటికి వచ్చానని రామలక్ష్మి చెప్తుంది. అప్పుడే శ్రీలత సందీప్ లు ఇంటికి వస్తారు. ఎక్కడికి వెళ్లారని శ్రీవల్లి అడుగగా.. నీకెందుకు నీ పని నువ్వు చూసుకోమని శ్రీలత అంటుంది.
మీరు ఎక్కడికి వెళ్లారో నాకు తెలుసు ఆ అభి దగ్గరికి వెళ్లారు కదా అని శ్రీవల్లి అంటుంటే శ్రీలత కోప్పడుతుంది. సీతా, రామలక్ష్మి ఇంక రాలేదా అని శ్రీలత అడుగుతుంది. ఇద్దరు వాళ్ళ పుట్టింటికి వెళ్లారట అని శ్రీలతతో శ్రీవల్లి చెప్తుంది. మరొకవైపు సీతాకాంత్ పింకీ బర్త్డే కి సర్ ప్రైజ్ ఇవ్వాలని కేక్ తెప్పిస్తాడు. పింకీ చేత కేక్ కట్ చేయిస్తాడు. నువ్వు మీ అక్కలాగా భయపడకుండా దైర్యం గా ఉండు అని సీతాకాంత్ అనగానే.. మా అక్కకి ధైర్యం బాగుంటుంది కానీ ఒకసారి మాత్రమే భయపడింది. అది ఒక రింగ్ దొరికినప్పుడు.. అది ఎక్కడ మా నాన్న చూసి అమ్ముతాడోనని భయపడిందని సీతాకాంత్ కి పింకీ చెప్తుంది. మరి అలాంటి రింగ్ ఒకటి మీ అక్కకి ఇద్దామా అని సీతాకాంత్ అనగానే.. ఆమ్మో వద్దు ఒక్కరోజు ఉంటేనే టెన్షన్ పడ్డది. ఇక తన దగ్గరే ఉంటే ఇంకెలా ఉంటుందని పింకీ అంటుంది. ఇక రామలక్ష్మి వాళ్ళు వెళ్తుంటే ఇలాంటి భర్త దొరకడం నీ అదృష్టమని రామలక్ష్మితో సుజాత చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |